సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రణవ్

Pranab launches rice distribution programనవతెలంగాణ – జమ్మికుంట
దేశంలో ఏ ప్రభుత్వం చేయనట్టుగా రేషన్ కార్డు లబ్దిదారులకు సన్నబియ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అందజేస్తున్నామని  కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.బుదవారం  జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 15 వార్డులో,జమ్మికుంట మండల పరిధిలోని వావిలాల,మడిపల్లి గ్రామాల్లో ఉచిత సన్నబియ్యం కార్యక్రమాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.ఉచిత సన్నబియ్యం పథకం ద్వారా ప్రభుత్వంపై ఏటా 2300కోట్ల పై చిలుకు భారం పడుతున్న, పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఒక్కొక్కటిగా పనులు చేస్తూ వస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు రమేష్, ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, ఇల్లందకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య, సారంగం పాని, మాజీ కౌన్సిలర్లు పొనగంటి రామ్మూర్తి, బొంగోని వీరన్న, ఎలగందుల స్వరూప శ్రీహరి, పొన్నగంటి సారంగం, నాయకులు మండ అశోక్ గౌడ్ తదితరులు ఉన్నారు.
Spread the love