
గర్భిణీ స్త్రీలు వైద్యుల సూచనలు సలహాలు పాటించాలని మెడికల్ అధికారి విజయ మహాలక్ష్మి తెలిపారు. గురువారం రాజంపేట్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రతినెల వైద్య పరీక్షలు నిర్వహించుకొని పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సంగీత, ఐశ్వర్య, సూపర్వైజర్ మంజూరు ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు.