నవతెలంగాణ – జన్నారం
గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మా అన్నారు. మంగళవారం చెన్నారం మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం 2లో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోషణ పక్వాడ ప్రోగ్రామ్స్ నేటి నుండి 22తేదీ వరకు షెడ్యూల్ ప్రకారంగా అన్నీ అంగన్వాడీ సెంటర్స్ లో పోషకాహారం పైన తల్లులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంధన్నారు. ఇందులో భాగంగా మొదటి రోజుగా జన్నారం-2 అంగన్వాడీ సెంటర్లొ గర్భిణి స్త్రీలకు,తల్లులకు సరైన పోషకాహారం తీసుకోవాలనీ మరియు గర్బిణీ మొదటి నెల నుండి బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చే వరకు ఉండె 1000 రోజుల ప్రాముక్యథ గురించి వివరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ సుజాత,సునీత,పార్వతి ఆశ- అంజుమా బాను గర్బిణీలు,తల్లులు పాల్గొన్నారు.