కాటాపూర్ హై స్కూల్ కు ఉపాధ్యాయ బృందం, సౌండ్ సిస్టం బహుకరణ..

– ఉపాధ్యాయ బృందాన్ని అభినందించిన ఎంఈఓ 
నవతెలంగాణ -తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ కు, పాఠశాల ఉపాధ్యాయ బృందం 35 వేల రూపాయల విలువచేసే సౌండ్ సిస్టం ను జడ్.పి.హెచ్.ఎస్ కాటాపూర్ ప్రధానోపాధ్యాయులు బాణాల సుధాకర్ ఆధ్వర్యంలో బహుకరించారు. దీనిని మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెడ్ పి హెచ్ ఎస్ కాటాపూర్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయ బృందం ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం గొప్ప నిర్ణయం అన్నారు. దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని అన్నారు. పాఠశాల సమాజానికి ఓ చిన్న రూపం. పాఠశాల అనే చిన్న సమాజాన్ని తీర్చిదిద్ది తద్వారా దేశాభివృద్ధిలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్న వారు ఉపాధ్యాయులు అని అన్నారు. విద్యార్థుల శ్రేయస్సు ఆశయంగా అహర్నిశలు శ్రమిస్తూ అంకితభావం గల కాటాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ ఉపాధ్యాయులు అని కొనియాడారు. పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, గ్రామస్తుల సహకారం అందించాలని కోరారు. గ్రామస్తుల సహకారంతో పాఠశాల అన్ని రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శక్రు నాయక్, అక్బర్ బాషా, జీవన్ లాల్ కోడూరు సమ్మయ్య, సామ్సన్, వెంకటేష్ సుతారి పాపారావు వ్యాయామ ఉపాధ్యాయులు విజయ గోరంట్ల రాజేష్ జయపాల్ మోహన్ శ్రీదేవి తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love