ట్రంప్ తో భేటీ కానున్న ప్రధాని మోడీ.. ఎప్పుడంటే ?

Prime Minister Modi to meet Trump.. When?నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాషింగ్టన్ డీసీలో ఈ భేటీ ఉండనుందని సమాచారం. అమెరికా పర్యటన సందర్భంగా మోడీకి ట్రంప్ విందు కూడా ఇచ్చే అవకాశముంది. ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని ఈ నెల 12వ తేదీ సాయంత్రం వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఆయన అమెరికా రాజధానిలోనే ఉంటారు. ఈ రెండు రోజుల పాటు అమెరికన్ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో, ఎన్నారైలతో ఆయన సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Spread the love