నవతెలంగాణ-హైదరాబాద్: వయనాడ్ బాధితుల రుణాలను మాఫీ చేయలేమన్న కేంద్రం నిర్ణయంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ గురువారం మండిపడ్డారు. ఈ చర్యను నమ్మకద్రోహంగా అభివర్ణించారు. వయనాడ్ బాధితులు ఇళ్లు, భూమి, జీవనోపాధి పాటు సర్వం కోల్పోయారు. అయినా కేంద్ర ప్రభుత్వం వారికి రుణ మాఫీ చేసేందుకు కూడా నిరాకరిస్తోంది. వారు రుణాల రీషెడ్యూల్, పునర్ నిర్మాణం మాత్రమే దక్కింది. ఇది ఉపశమనం కాదు.. నమ్మకద్రోహమని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కేంద్రం ఉదాసీనతను తమ పార్టీ, తాను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వయనాడ్‌లోని తమ సోదర, సోదరీమణులకు అండగా నిలబడతామని అన్నారు. వారి బాధను విస్మరించబోమని, న్యాయం జరిగే వరకు ప్రతి వేదికపైనా వారి తరపున గొంతుకను వినిపిస్తామని అన్నారు.