ప్రభుత్వాసుపత్రులలో సమస్యలను పరిష్కరించాలి..

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల మందు లను పేషంట్లకు అందుబాటులో ఉంచాలని, ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్స్ పోస్టులను భర్తీ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐ వైఎఫ్) డిమాండ్ చేసింది.  ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కింగ్ కోఠి  జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సంద ర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల డయాగ్నో సిస్ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచాల న్నారు. ఆసుపత్రిలో గత పదిరోజులుగా సీటీ స్కాన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ స్కాన్  నింగ్ సెంటర్లకు వెళుతున్నారని అన్నారు. ఆసు పత్రిలో 22 రకాల ప్రధాన మందుల కొరత ఉంద ని, మరుగుదొడ్లు సరిగా లేవన్నారు. అనంతరం ఏఐవైఎఫ్ ప్రీతినిధి బృందం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. జి. రాజేంద్రనాథ్  కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసి డెంట్ నెర్లకంటి శ్రీకాంత్, టి.సత్యప్రసాద్, షేక్ మహమూద్, జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీద్, అనిల్, కిరణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love