– కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్
నవతెలంగాణ – తాడ్వాయి
మేడారం వనదేవతలను కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆదివాసి నేత ఈసం నారాయణ ఆదివారం సతీ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారు. ఎండోమెంట్ అధికారులు, పూజారులు ఆదివారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. అనంతరం శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. నారాయణ మాట్లాడుతూ ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. మా భాగ్యంగా భావించారు. కానీ ఎండోమెంట్ అధికారులు మేడారంలో ఎండలో వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వైఖరి వహిస్తున్నారని మండిపడ్డారు. తాగునీరు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. గద్దెల ప్రాంగణంలో పూర్తి స్థాయిలో నీడ మంచలు వేయాలని అన్నారు. కింద బాగా కాలు కాలుతున్నాయని భక్తులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు.