Monday, August 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను ప్రచారం చేయండి

తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను ప్రచారం చేయండి

- Advertisement -

లండన్‌లో తెలుగు ప్రవాసులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్‌లోని తెలుగు ప్రవాసులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆదివారం లండన్‌లోని తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్‌ ప్రగతిపై ఈ సందర్భంగా వారితో చర్చించారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను ప్రచారం చేస్తూ, రాష్ట్రానికి రాయబారులుగా నిలవాలని కోరారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌కు హాజరుకావాలని కోరారు. పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ర్టంలో యువతకుఉ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రవా సాంధ్రులు సహకారాన్ని అందించాలని కోరారు.

అన్ని విషయాలపై మాట్లాడుతా
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయనను అమెరికా వెళ్లకుండా అడ్డుకుందని, రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనికి సంబంధించిన అన్ని విషయాలనూ ఆయన హైదరాబాద్ వచ్చాక మాట్లాడుతానని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. అనుమతి నిరాకరణ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు, పార్టీ నాయకులకు, ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం లండన్ లో తన సమావేశాలు ముగిశాయని వెల్లడించారు. మూడు రోజుల పర్యటనలో అద్భుతమైన మద్దతు లభించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం లండన్ నుంచి బోస్టన్ వెళ్లాల్సి ఉందనీ, అయితే కేంద్రం నిరాకరించడంతో తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతున్నట్టు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -