నిజామాబాద్ లో 4 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్స్ పొందిన వారిని పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల ప్రకారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు వరిదిలోని కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబులుగా 4 మంది ప్రమోషన్ పొంది సోమవారం నిజామా బాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవర్, ఐ.పి.యస్. ని పుష్పగుచ్చాలు ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొంత కాలంగా ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తున్న కానిస్టేబుల్స్ కు హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని, ఈ సందర్బంగా ప్రమోషన్ పొందిన హెడ్ కానిస్టేబుల్స్ కు పోలీస్ కమీషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు. బి. కిషన్ , పి.సి 1609 టౌన్ 1 పోలీస్ స్టేషన్, సి.అజయ్ కుమార్, పి.సి 230 టౌన్ 1 పోలీస్ స్టేషన్, బి.సురేష్, పి.సి 1734 మోర్తాడ్ పోలీస్ స్టేషన్, ఎస్.రవికాంత్ , పి.సి 1724 సి.ఎస్.బి, పదోన్నతి పొందిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.