Tuesday, July 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపీవోకేలో ఆందోళనలు..ఆరుగురి మృతి

పీవోకేలో ఆందోళనలు..ఆరుగురి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో ఆందోళనలు ఉద్ధృత రూపం దాల్చాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జేఏఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన నిరసన కారులపై పాక్‌ భద్రతాబలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే.. అమెరికా వైట్‌హౌస్‌ ఎదుట పీవోకేకు చెందిన పలువురు గుమిగూడారు. పీవోకేలో పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -