Tuesday, July 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచర్ల -2 బాహుబలి బ్లాక్

తాడిచర్ల -2 బాహుబలి బ్లాక్

- Advertisement -

50 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు

తాడిచర్ల-2 సింగరేణి సంస్థకు బాహుబలి బ్లాక్ అని, ఈ బ్లాక్ సింగరేణికి కేటాయించడం మూలంగా ఈ ప్రాంతంలోని వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా మంగళవారం కాటారం మీదుగా మండల కేంద్రమైన తాడిచెర్ల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

తాడిచర్ల బ్లాక్-1ను గత ప్రభుత్వం సొంత లబ్ధి కోసం కాంట్రాక్టర్కు అప్పగించిందన్నారు. ఆ బ్లాక్ లో 47 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరుగుతుందని, తాము సింగరేణికి అప్పగించిన బ్లాక్ -2లో 340 నుంచి 350 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఇది బీజేపీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమన్నారు. తాడిచర్ల బ్లాక్-2లో సుమారు 50 ఏళ్ల వరకు బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, తద్వారా రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నిర్ణయాలతో అప్పుల ఊబిలోకి వెళ్లిన సింగరేణి సంస్థను తాము పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. సింగ రేణి తెలంగాణ గుండె చప్పుడు అని, కార్మికుల కష్టాన్ని వృథా కానివ్వమనిన్నారు. తాడిచెర్ల బ్లాక్-2 ఏర్పాటుతో పరోక్షంగా, ప్రత్యక్షంగా ఐదు వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అలాగే తాడిచెర్ల ఓ పట్టణంలా అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, ఎంపీ ఈటేల రాజేందర్, పార్టీ రాష్ట్ర నాయకురాలు చందుపట్ల కీర్తిరెడ్డి, సునీల్ రెడ్డి, నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మోహన్ రావు, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ పటేల్ తోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -