Tuesday, August 4, 2026
E-PAPER
Homeజాతీయంగాలిలో ఉండగా విమానంలో అనుకొని కుదుపు..

గాలిలో ఉండగా విమానంలో అనుకొని కుదుపు..

- Advertisement -
  • 10 మంది ప్రయాణికులు, నలుగురు కేబిన్ సిబ్బందికి గాయాలు

నవతెలంగాణ-హైదరాబాద్: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా తీవ్రమైన టర్బులెన్స్‌కు లేదా అప్‌డ్రాఫ్ట్-డౌన్‌డ్రాఫ్ట్‌కి లోనైంది. దీని ప్రభావంతో విమానం ఎత్తులో అకస్మాత్తుగా మార్పు వచ్చి, ఏకంగా 300 అడుగులు కిందకు జారిపోయింది. ఈ సమయంలో ఒక్కసారిగా పెద్ద కుదుపు రావడంతో విమానంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురై, నియంత్రణ కోల్పోయి పడిపోయారు. అయితే, పైలట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పి, సురక్షితంగా ఢిల్లీ వైపు ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ అనుకోని సంఘటనలో 10 మంది ప్రయాణికులు, నలుగురు కేబిన్ క్రూ సిబ్బంది గాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -