నవతెలంగాణ – జుక్కల్
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా నాగల్ గావ్ గ్రామంలోని రెండు అంగన్వాడి కేంద్రం టీచర్స్ పంచశీల, అంజమణి , ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది జీపీ కార్యదర్శి లింగు రామ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ జాదవ్ సునంద విజయ పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, జిపి కార్యదర్శి , అంగన్వాడీ టీచర్లు పంచశీల, అంజమని మాట్లాడుతూ.. తల్లిపాల ఔన్నత్యం గొప్పదనం మరియు ముర్రుపాలు వాటి విలువను గురించి పోషక విలువలను గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలోని గర్భిణులకు, బాలింతలకు పోషక ఆహార విలువల గురించి వివరించడం జరిగింది. 0 నుండి 6, ఆరు మరియు ఏడు నెలల శిష్యులకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని తెలపడం జరిగింది. ఏడు నెలలు దాటిన పిల్లలందరికీ అనుబంధ ఆహార పదార్థాలు తప్పక మొదలుపెట్టాలని తల్లులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునంద పాటిల్ తో పాటు , ఉప సర్పంచ్, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



