- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని చిన్న చిన్న ఏడ్గి అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ టీచర్ చంద్రకళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బాలింతలు, గర్భిణీలు, తల్లులు , మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ తల్లిపాలు, పౌష్టికాహారం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పుట్టిన పిల్లలకు తల్లి ముర్రు పాలు శ్రేష్టమని తెలియజేశారు. చిన్న శిశువుకు తల్లుపాలు తాగించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు ,అంగన్వాడీ టీచర్, గర్భిణులు, బాలింతలు, తల్లులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



