
ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు జనార్ధన్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య లు మాట్లాడుతూ..పాఠశాల అభివృద్ధిలో దాతల సహకారం కీలకమని,సమాజ భాగస్వామ్యంతో పాఠశాలలు ప్రగతి బాట పడతాయని అన్నారు. కోర్వ నవీన్ రెడ్డి న్యాయవాది కెఎన్ఆర్ ట్రస్టు అందించిన సహకారంతో ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను శ్రద్ధగా చదివి పది పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని తల్లి దండ్రులకు పాఠశాలకు మండలానికి మంచిపేరు తేవాలని సూచించారు. ముందుగా పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యం,మహేష్, లింగారెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.