ప్రజావాణి బుధవారానికి వాయిదా

నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : హైదరాబాద్ మహాత్మా బాపు రావు పూలే ప్రజా భవన్ లో మంగళవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేయడం జరిగిందని ప్రజావాణి నోడల్ అధికారి దివ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాభవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశాలు జరుగుతున్నందున మంగళవారం నాడు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్టు ఆమె తెలిపారు. ఈ మార్పును గమనించ అర్జీదారులు బుధవారం నాడు ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని  తెలిపారు.
Spread the love