నవతెలంగాణ-జమ్మికుంట: మైనార్టీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పుల్లూరి స్వప్న తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని స్థానిక సువర్ణ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో 30 రోజులు పాటు ఉపవాస దీక్ష చేయడం అభినందనీయమని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే సంక్షేమ పథకాలలో మైనార్టీ సోదరులకు తగిన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట తహసిల్దార్ గట్ల రమేష్ బాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ సతీష్ రెడ్డి, ధర్మారం సింగిల్ విండో చైర్మన్ కటంగురి శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు, సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్ తదితరులు పాల్గొన్నారు.