నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలి..

– జిల్లా వ్యవసాయాది కారి పాల్వాయి శ్రవణ్, విత్తన దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా అధికారి
నవతెలంగాణ – పెద్దవూర
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అమ్మాలని జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్ అన్నారు. శుక్రవారం మండలం లో పంటల సాగు సర్వే చేపట్టి మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తన, పురుగు మందులు, ఎరువుల డీలర్ల కు సమావేశం నిర్వహించి, మాట్లాడారు విత్తనాలు, ఎరువుల అమ్మకంపై రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, నాసిరకమైన విత్తనాలు అమ్మితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.రైతులకు విత్తనాలను, ఎరువులను ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువకు విక్రయించినట్లు తెలిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, షాపుల లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. అయన వెంట ఏఓ సందీప్, వ్యవసాయ విస్తరణ అధికారులు రాము ఆంజనేయులు, మధుకర్,సీతార, తనూజా, రైతులు ఉన్నారు.

Spread the love