నాణ్యత ప్రమాణాలను పాటించాలి: పోచారం

నవతెలంగాణ – నసూరుల్లాబాద్ 
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. బుధవారం నసూరుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులోని శ్రీ కొచ్చేరి మైసమ్మ దేవాలయం వద్ద రూ.1కోటి 60 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న వసతి గృహం, 40 లక్షల రూపాయలతో  వేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ  పనులను ఈరోజు పరిశీలించిన్నారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అధికారులు కాంట్రాక్టులను నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే తగు చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మైలారం గ్రామ శివారులో వెలసిన కొచ్చేది మైసమ్మ ఆలయ నిర్మాణానికి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని నాణ్యత ప్రమాణాలు పాటించి అభివృద్ధి పనులు జరగాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన పనులను చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్త్య విఠల్ , జిల్లా కో ఆప్షన్ నెంబర్ మజీద్, సీనియర్ నాయకులు అంజిరెడ్డి, రాము, ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love