
విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను, ప్రతిభ పాటవాలను వెలికి తీయడానికి క్విజ్ పోటీలు చాలా ఉపకరిస్తాయని జమ్మికుంట ఎల్ఐసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రూపి రెడ్డి ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఎల్ ఐ సి వారోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాలలో పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో క్విజ్ పోటీలను ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఎల్ఐసి ని 1956వ సంవత్సరంలో స్థాపించడం జరిగిందన్నారు. నాటి నుండి నేటి వరకు భీమా రంగంలో పాలసీదారుల కు సేవ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నో ప్రైవేటు భీమా ఏజెన్సీలు వచ్చినప్పటికిని, కాలానుగుణంగా కొత్త కొత్త పాలసీలను పాలసీదారులకు పరిచయం చేస్తూ నేడు భీమా రంగంలో భారత దేశంలో నెంబర్ వన్ గా ఉందని ఆయన కొనియాడారు. నేడు సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు ఇతర కొన్ని రంగాలకు ఎల్ఐసి అప్పులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానాన్ని పొందగా, ద్వితీయ స్థానాన్ని శ్రీ కాకతీయ హై స్కూల్, తృతీయ స్థానాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపల్లి విద్యార్థిని విద్యార్థులు కైవసం చేసుకున్నారు . ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామెర సుధాకర్ ఉపాధ్యాయులు మర్రి అవినాస్, కె రవికుమార్ , చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.