మోడీ పాలనలో ప్రతిపక్ష నాయకులపై దాడులు : రాహుల్ గాంధీ

నవతెలంగాణ-హైదరాబాద్ : తాను ఈడీ నుంచి 55 గంటల విచారణను ఎదుర్కొన్నానని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం ఆయన లోక్ సభలో మాట్లాడుతూ… భారతదేశ ఆలోచన, రాజ్యాంగంపై దాడిని అడ్డుకుంటామని… తాము రక్షణగా నిలబడతామన్నారు. రాజ్యాంగంపై దాడిని అడ్డుకున్న వ్యక్తులపై దాడి జరుగుతోందని ఆరోపించారు. మోడీ పాలనలో చాలామంది ప్రతిపక్ష నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు. విపక్ష నేతలను వేధించడం సరికాదన్నారు. అధికారం కంటే నిజం గొప్పదనే విషయం తెలుసుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు తాను సంతోషంగా ఉన్నానని… గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణ, సంపద వికేంద్రీకరణ, పేదలు, దళితులు, మైనార్టీలపై దౌర్జన్యాన్ని ప్రతిఘటించిన వారిని అణచివేశారని మండిపడ్డారు. ప్రధాని మోడీ ఆదేశాలతోనే తనను విచారణ సంస్థలు విచారించాయన్నారు. ప్రతి మతం కూడా ధైర్యాన్ని బోధిస్తుందన్నారు.

Spread the love