Sunday, August 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా రాజశేఖర్

ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా రాజశేఖర్

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
పెద్దవంగర ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా దుర్సోజు రాజశేఖర్ ఎన్నికయ్యారు. మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్‌ గౌరవ అధ్యక్షుడిగా రంగు లక్ష్మణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సుంకరి ఓంకార్, ఉపాధ్యక్షుడిగా చట్టు యాకన్న, కోశాధికారిగా బారీ విక్రమ్, కార్యదర్శులుగా జాటోత్ దామోదర్, జాటోత్ సుధాకర్, ఓరిగంటి సైదులు ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, ఓంకార్ మాట్లాడుతూ అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు కాలయాపన చేయకుండా వెంటనే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం స్థలం తో పాటుగా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధి, జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన విలువల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. యువ జర్నలిస్టులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు, సభ్యులందరినీ కలుపుకొని ప్రెస్ క్లబ్‌ ను మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానన్నారు. ప్రెస్ క్లబ్ సభ్యుల మధ్య ఐక్యతను పెంపొందించడం, జర్నలిస్టుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -