నవతెలంగాణ-ఆలేరు టౌన్
యువతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మండల యువజన సంఘాల సమితి అధ్యక్షుడు తాళ్లపల్లి మహేష్ అన్నారు. ఆలేరు పట్టణంలో ఆదివారం ద్వారక నగర్ లో భజరంగ్ యూత్ అసోసియేషన్ మేరా యువ భారత్, నల్గొండ వారు నిర్వహించే యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని యువతకు ప్రభుత్వం తరఫున వచ్చే కార్యక్రమాల గురించి వివరించారు.
యువతను సన్మార్గంలో నడుస్తూ..సమాజ అభివృద్ధికి ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల యువజన సంఘాల సమితి అధ్యక్షుడు తాళ్లపల్లి మహేష్,భజరంగ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ సాయికుమార్, ఉపాధ్యక్షుడు, వెంకట్ ,ప్రధాన కార్యదర్శి సందీప్ , ప్రదీప్, శివకుమార్, కిరణ్, రాజు,వివేక్,భాను ,సతీష్, నవీన్ వంశీ, నాగరాజు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.



