•ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పబ్బు వీరస్వామి
నవతెలంగాణ – మర్రిగూడ
గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పబ్బు వీరస్వామి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఆదివారం మండల కేంద్రంలో ఎరుకల నిరంజన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఆ సంఘం 4 వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గీత కార్మికులను పట్టించుకోవడంలేదని ఎన్నికల ముందు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.గీత కార్మికుల సంక్షేమానికి 1000 కోట్లు,నియోజకవర్గానిక నీరా ప్రాజెక్టుగా ఏర్పాటు చేయాలి కోరారు.
గీత కార్మికుడు చనిపోతే వెంటనే భార్యకు పింఛను ఇవ్వాలి,గ్రామాలలో చెట్ల పెంపకాన్ని ప్రభుత్వమే చేపట్టాలని,కార్మికులకు టీవీఎస్ మోపెడు,దరఖాస్తులు చేసుకున్న వారికి వెంటనే టి ఎప్ టి కార్డులు,అర్హులైన ప్రతి గీతకార్మికులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం15 మందితో కూడిన గీతా పనివారాల సంఘం మండల నూతన కౌన్సిల్ ను ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా ఐతగోని వెంకటయ్య,కార్యదర్శి గా తానేదార్ పల్లి ఈశ్వరయ్య,ఉపాధ్యక్షులుగా బోడ అంజయ్య,కొత్త శేఖర్,సహాయ కార్యదర్శి గా కర్నాటి శేఖర్,కోశాధికారి గా అయితగోని యాదయ్య,ఐదుగురు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈదుల బిక్షం రెడ్డి,మండల కన్వీనర్ బుర్ర శేఖర్,తదితరులు పాల్గొన్నారు.



