రాజీవ్ యువ వికాసం పథకంపై ప్రజలో విస్తృత ప్రచారం చేయాలి

Rajiv Yuva Vikasam Scheme should be widely publicized among the people.నవతెలంగాణ – ఉప్పునుంతల
జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఆదేశాల మేరకు గురువారం ఉప్పునుంతల మండల పరిషత్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ నాగేందర్ ఆధ్వర్యంలో రాజీవ్ యువ వికాసం పథకం పై అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశములో రాజీవ్ యువ వికాసం పథకం గురించి ప్రతి గ్రామాల్లో టామ్ టామ్ వేయించుట, ఇట్టి పథకం గురించి ప్రతి ఇంటికి సమాచారము వెళ్ళే విధంగా ప్రకారం చేయుటకు, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అట్టి ప్రతని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రంలోని సమర్పించుటకు తెలియజేయనైనది.  ఇట్టి పథకంలో దఖాస్తు చేసుకొనుటకు చివరి తేది ఈనెల 14 వరకు ప్రచారం చేయుటకు సూచనలు చేశారు. స్పెషల్ ఆఫీసర్ సూచలు జారీ చేశారు. ఈ సమావేశములో మండల ప్రత్యేక అధికారి, ఎంపిడిఓ మోహన్ లాల్, MPO నారాయణ, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు.
Spread the love