రాజీవ్ యువ స్కీం ను ప్రతి యువకుడికి వర్తింపచెయ్యాలి 

Rajiv Yuva Scheme should be applied to every youthనవతెలంగాణ – కంఠేశ్వర్ 

యువతను ఆర్థికంగా బలోపేతం చెయ్యడానికి తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం స్కీం పై బీసీ సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాస్ స్కీంను ప్రతి బీసీ బిడ్డకు వర్తింపచెయ్యాలి. గతంలో బీసీ బంధు తీసుకొని ఉంటే ఆ డబ్బుల పూర్తి స్కీంలో నుండి మినహాయింపు ఇచ్చి రాజీవ్ యువ వికాసంలో అవకాశం కల్పించాలని సహాయ బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య ను కోరిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నరాల సుధాకర్ తో పాటు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్ చంద్రకాంత్ పాల్గొన్నారు.
Spread the love