– యు సి డి డిపిఓ పి లక్ష్మీబాయి
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
రాజీవ్ యువ వికాసం కోసం ఆన్లైన్ ద్వారా, మీసేవా కేంద్రాల ద్వార దరఖాస్తు చేసుకున్న వారు ఆ దరఖాస్తు ఫారాలను వార్డు కార్యాలయాల్లో అందజేయాలని గోషామహల్ జిహెచ్ఎంసి సర్కిల్ -14 యు సి డి డిపిఓ పి. లక్ష్మీబాయి అన్నారు. గురువారం వార్డ్ కార్యాలయంలో మాట్లాడుతూ.. డిప్యూటీ కమిషనర్ దుబ్బాక లావణ్య ఆదేశాలతో గోషామహల్ సర్కిల్ పరిధిలోని గన్ ఫౌండ్రీ, జాంబాగ్ , బేగంబజార్, గోషామహల్, మంగళహాట్, దత్తాత్రేయనగర్ డివిజన్ లలోని వార్డు కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అన్ని డివిజన్ వార్డు కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. వార్డు కార్యాలయాల్లో రిసోర్స్ పర్సన్ (ఆర్ పి) లు అందుబాటులో ఉంటారని తెలిపారు.