నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులందరికీ రేపటీ నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ కింద తంగళ్ళపల్లి మండలంలో 30 గ్రామాలకు గాను 3188 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. వారందరికీ ఆయా గ్రామాల వారీగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2: 30 నిమిషాల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఆయా గ్రామాల దరఖాస్తుదారులకు పంచాయతీ కార్యదర్శులు సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయంలో సమయాన్ని తేదీని గ్రామంలో ప్రకటిస్తారన్నారు. పంచాయతీ కార్యదర్శులు సూచించిన తేదీ ప్రకారంగానే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.