గాంధారి మండలంలోని రామలక్ష్మిన్ పల్లి గ్రామానికి బస్సు ట్రిప్పుల సంఖ్య పెంచాలని గ్రామానికి చెందిన విద్యార్థులు కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కి గాంధారి లింగంపేట్ బస్ ట్రిప్పులు పెంచాలి అని తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అదే విధంగా నల్లమడుగు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎక్కువగా విద్యార్థులకు పాఠాలు బోదించకుండ సెల్ ఫోన్లు మాట్లాడుతూన్నారని, సరిగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తలేరని కలెక్టర్ కి తెలిపారు. అందుకు స్పందిస్తూ మీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా అని విద్యార్థులకు హామీ ఇచ్చారు.