ఎస్బీఐ నూతన ఎండీగా రామ మోహన్‌ రావు నియామకం

SBI as new MD Appointment of Rama Mohan Raoహైదరాబాద్‌ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రామ మోహన్‌ రావు అమర నియమితులయ్యారు. దీంతో మరో తెలుగు వ్యక్తికి కీలక పదవీ దక్కినట్లయ్యింది. తెలుగు వ్యక్తి అయినా సీఎస్‌ శెట్టి ప్రస్తుతం ఎస్బీఐ చైర్మెన్‌గా ఉన్నారు. రామ మోహన్‌ నియామకానికి కేంద్ర విత్త సేవల శాఖ ప్రతిపాదన చేయగా.. ప్రభుత్వ కమిటీ ఆఫ్‌ ది క్యాబినెట్‌ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. ఈ హోదాలో రామ మోహన్‌ రావు మూడేండ్ల పాటు కొనసా గనున్నారు. ఆయనకు బ్యాంకింగ్‌లో 29 ఏండ్ల అనుభవం ఉంది. 1991లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. ఎండీగా నియామకానికి ముందు ఆయన ఎస్బీఐ భోపాల్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా పని చేశారు. అదే విధంగా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌ కార్యకలాపాలను చూశారు. ముఖ్యంగా రుణాలు, రిస్కు, అంతర్జాతీయ బ్యాంకింగ్‌లో విశేష అనుభవం కలిగి ఉన్నారు. సింగపూర్‌, అమెరికాలోనూ పని చేసిన అనుభవం ఉంది. ఎస్బీఐ చికాగో శాఖ సీఈఓ, ఎస్బీఐ కాలిపోర్నియా ప్రెసిడెంట్‌గా పని చేశారు. 2028 ఫిబ్రవరి 29న పదవీ విరమణ పొందనున్న ఆయన పనితీరు ఆధారంగా పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉంది.

Spread the love