నవతెలంగాణ–మల్హర్‌రావు: మండలంలోని నాచారం గ్రామంలో ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును శనివారం కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మాదరపు వెంకన్న అందించారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందును ఇచ్చే కార్యక్రమాన్ని ముస్లిం పెద్దలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులక ఇఫ్తార్ విందును ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.