రమేష్ రెడ్డి కి మళ్ళీ హ్యాండ్ ఇచ్చిన అధిష్టానం

– నల్గొండ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి
– మరి పటేల్ రమేష్ రెడ్డి పరిస్థితి ఏంటి..?
నవతెలంగాణ – సూర్యాపేట
ఏఐసీసీ అగ్ర నేతల హామీతో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరించుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి కి అధిష్ఠానం మరోసారి హ్యాండ్ ఇచ్చింది. ఇందుకు ప్రధాన కారణం నల్గొండ యంపీ గా తాను పోటీ చేస్తానని మాజీమంత్రి, సీనియర్ నాయకులు కుందురు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కి నల్గొండ యంపీ టిక్కెట్ కేటాయిస్తూ ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. ఈ
ప్రకటనతో రమేష్ రెడ్డి పరిస్థితి సంకటంగా మారింది.ఇదిలావుండగా 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రెడ్డి కి ఏఐసీసీ అగ్రనేతలు పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి బుజ్జగించిన విషయం తెల్సిందే. అదేవిధంగాఎఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి లు ప‌టేల్ రమేష్ రెడ్డి కి నల్గొండ ఎంపీ స్థానం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన నామినేషన్  ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇదిగాక ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డి లు కూడా రమేష్ రెడ్డి కి యంపీ స్తానం కేటాయింపు పై తమకు అభ్యంతరం లేదని  వారు లిఖిత పూర్వకంగా హామీలు ఇచ్చారు.రాష్ట్ర నాయకత్వం, అధిష్టాన వర్గం సూచనలను గౌరవించి అభ్యర్థిత్వాన్ని ఉపసంహ రించుకున్న  రమేష్ రెడ్డి ని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున  ఖర్గే కూడా అభినందించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో దామోదర్ రెడ్డి తో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. కాగా దామోదర్ రెడ్డి స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. రమేష్ రెడ్డి తో పాటు ఆయన వర్గ్యులో కొంతమంది ఎన్నికల్లో సహకరించక పోవడంతోనే దామోదర్ రెడ్డి ఓటమి చెందారని ఆయన వర్గ్యులు విమర్శిస్తు వస్తున్నారు. ఇదిలావుండగా గత 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రమేష్ రెడ్డి కి టిక్కెట్ దక్కని విషయం తెల్సిందే.ఆనాడు కూడా నల్గొండ యంపీ టిక్కెట్ ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం తో ఆయన నామినేషన్ విరమించు కున్నారు.కాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ యంపీ గా పోటీ చేయడంతో రమేష్ రెడ్డి కి అధిష్ఠానం ఆనాడు మొoడి చెయ్యి చూపిన విషయం తెల్సిందే.తిరిగి 2023 డిశంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రమేష్ రెడ్డి కి సూర్యాపేట టిక్కెట్ కేటాయింపులో మొoడి చేయి చూపింది. ఇదే సమయంలో నల్గొండ యంపీ టిక్కెట్ ఇస్తామని చెప్పిన అది నాయకులు మళ్లీ మరో సారి భారీగా హ్యాండ్ ఇచ్చారు.  టికెట్ విషయంలో రమేష్ రెడ్డి కి అన్యాయం జరుగుతుందా అని ఆయన వర్గ్యులు ఊహించిన ఆందోళన ప్రస్తుతం నిజమైంది. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని ఇందులో ఏదైనా సాధ్యమే అనే నానుడి నెలకొంది. ఈ క్రమంలో రమేష్ రెడ్డి కి అధిష్టానం మరో మారు హ్యాండ్ ఇచ్చింది. కాగా తన స్నేహితుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నమ్మి 2016 లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెల్సిందే.ఇక 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యాపేట టిక్కెట్ కోసం రమేష్ రెడ్డి ఆశించారు.ఇందుకు రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ వద్ద టిక్కెట్ కోసం గట్టిగా పట్టు బట్టారు.కాగా సీనియర్ అయిన దామోదర్ రెడ్డి కి సూర్యాపేట టిక్కెట్ కేటాయించిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో రమేష్ రెడ్డి కి నల్లగొండ యంపీ టిక్కెట్ ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలానుగుణంగా రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కావడంతో ఈసారి టిక్కెట్ తనకు కన్ఫర్మ్ అని రమేష్ రెడ్డి భావించారు. ఇందుకు గాను టిక్కెట్ కోసం డిల్లీలో కూడా ఫైట్ చేశారు. చివరికి టిక్కెట్ దామోదర్ రెడ్డి కె దక్కిన విషయం తెల్సిందే. అప్పుడు కూడా నల్గొండ యంపీ టిక్కెట్ ఇస్తామని రమేష్ రెడ్డి ని బుజ్జగించారు.కానీ రమేష్ రెడ్డి కి ఇచ్చిన హామీని మాత్రం అధిష్ఠానం విస్మరించింది.రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్ లభించక పోవడం… అధిష్టానం నల్గొండ యంపీ టిక్కెట్ ఇస్తామని రెండు సార్లు ఇచ్చిన హామీని అమలు చేయక పోవడంతో రమేష్ రెడ్డి తో పాటు ఆయన వర్గ్యులు డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.ఇక మొదటి నుంచి ఇప్పటి వరకు తను నమ్ముకున్న స్నేహితుడు, సియం రేవంత్ రెడ్డి పైనే రమేష్ రెడ్డి గంపెడు ఆశలు పెట్టుకున్నారు.రానున్న కాలంలో ఏదైనా ప్రోటోకాల్ పదవి దక్కక పోతుందా అని రమేష్ రెడ్డి వర్గ్యులు ఆశ తో ఎదురు చూస్తున్నారు. మునుముందు ఎం జరగనుందో వేచిచూడాలి.
Spread the love