– దాసరి పాండు సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
నవతెలంగాణ – బొమ్మలరామారం
అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులతో పాటు అన్ని రకాల సంక్షేమ పథకాలు వెంటనే ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు. పోరుబాటలో భాగంగా బొమ్మలరామారం మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్ణయించి సీనియర్ అసిస్టెంట్ శోభారాణి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తామని గత ప్రభుత్వము ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అరులైన పేదలందరికీ రేషన్ కార్డులు అన్ని రకాల పెన్షన్లు రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేటికీ ఏ ఒక్కరికి ఇవ్వడంలేదని అన్నారు. రేషన్ కార్డులు పెన్షన్లు దరఖాస్తు పెట్టుకోవడానికి ఆన్లైన్లోకి వెళ్తే సైటు ఓపెన్ కావట్లేదనేది ప్రజలు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని తెలిపారు. ప్రభుత్వం మాత్రం గొప్పలుగా చెప్పుతూ అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెబుతోంది. ఇది సరైనది కాదని చిత్తశుద్ధితో ప్రజా సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఉండాలని సూచించారు. దీంతోపాటు బొమ్మలరామారం మండలంలో సుమారు 20 గ్రామాలకు సాగునీరు త్రాగునీరు కు ఉపయోగపడే షామీర్పేట చెరువును రిజర్వాయర్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం, మండల కమిటీ సభ్యులు బ్రహ్మచారి, పున్నమ్మ, నాయకులు లక్ష్మయ్య, యాదగిరి, కేంసారం దేశెట్టి సత్యనారాయణ, మోకు దేవేందర్ రెడ్డి, ముద్ధం మసూదన్ రెడ్డి, గోల్కొండ బ్రహ్మచారి, లక్ష్మి ,సునీత, రేణుక, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.