Wednesday, July 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో ఆర్డీవో సమీక్ష

ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో ఆర్డీవో సమీక్ష

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో బుధవారం గుర్తింపు పొందిన జాతీయ మరియు ప్రాంతీయ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సార్) కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్డీవో డి.ఎస్. వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ఆన్‌లైన్ నమోదుపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాలో డబుల్ ఓట్లు, 1,000 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలపై ప్రతినిధులు పలు సందేహాలను లేవనెత్తారు. దీనిపై స్పందించిన ఆర్డీవో, నిబంధనల ప్రకారం డబుల్ ఓట్లను గుర్తించి తొలగిస్తున్నట్లు తెలిపారు. 1,200 మందికి మించి ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రేషనలైజేషన్ చేసి, అవసరమైతే రెండు భాగాలుగా విభజిస్తామని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీలు ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎన్నికల శాఖ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -