Sunday, September 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌తో శాంతిచర్చలకు సిద్ధం: పుతిన్‌

ఉక్రెయిన్‌తో శాంతిచర్చలకు సిద్ధం: పుతిన్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌తో శాంతి చర్చలను పునఃప్రారంభించడానికి తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలను పెంచుతున్నాయని విమర్శించారు. అయితే తమమధ్య 2022, 2025ల్లో కుదిరిన ఒప్పందాల ఆధారంగానే చర్చలు జరగాలని కోరారు. ఆ మేరకే శాంతిచర్చలను ముందుకుతీసుకెళ్తామని పుతిన్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌ రష్యా పౌరులపై దాడులు జరుపుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష చర్చలు సాధ్యం కావని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -