బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి: రేగ కేశవరావు

– ఇంటింటా సర్వే
నవతెలంగాణ – తాడ్వాయి
మండల కేంద్రంలో శుక్రవారం జయశంకర్ బడిబాట కార్యక్రమం ముమ్మరంగా నిర్వహించారు. బడి ఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని నోడల్ ఆఫీసర్ రేగా కేశవరావు ఉపాధ్యాయులను ఆదేశించారు. మండల వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామాల్లో పర్యటించి ఇంటింటా సర్వే నిర్వహించారు. ఇంటిలో గల విద్యార్థులు వివరాలను విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ (వి ఈ ఆర్) లో నమోదు చేశారు. ఐదేళ్లు నిండిన పిల్లలందరినీ బడిలో చేర్పించాలంటూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వాడి కేంద్రాల్లో ఐదేళ్ల నిండిన పిల్లలను దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని సూచించారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ రేగ కేశవరావు మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన పాఠశాలలు పున ప్రారంభం అవుతాయని, పాఠశాలలో పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ లు ఉచితంగా అందచేస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థికి రెండు జతల దుస్తులతో పాటు, మధ్యాహ్న భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గెజిటెడ్ హెడ్మాస్టర్ కేశవరావు, శాలిని, రవీందర్లతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love