ప్రభుత్వ భూములను కాపాడాలని జర్నలిస్టుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పట్టణంలో అన్యాక్రాంతమౌతున్న సర్వే నెం:113,114 లలో ప్రభుత్వ భూములను కాపాడాలని చౌటుప్పల్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ప్రారంభించారు. ఏళ్ల తరబడి జర్నలిజాన్నే నమ్ముకుని విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఎర్రసాని సతీష్ యాదవ్( సూర్య),పిసాటి నాగరాజు రెడ్డి (ఆంధ్రజ్యోతి),సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి( వార్త), తంబరేణి రవీందర్(సాక్షి టీవీ),కరంటోతు లింగనాయక్(నవతెలంగాణ),బోదుల నరేష్ (న్యూస్ 360),తొర్పునూరి సాయిలు గౌడ్(బి ఆర్ కె న్యూస్),కొండమడుగు శ్రవణ్ కుమార్ (సమర శంఖం)శ్యామల లింగస్వామి(నగర నిజం),పల్లపు కృష్ణ(నినాదం),కత్తుల రవి(మెట్రో ఉదయం),ఆరుట్ల లింగస్వామి(వార్త మిర్రర్),బొమ్మ మల్లేష్ (ప్రజా జ్యోతి),ఉదరి శంకర్(క్రైమ్ మిర్రర్),వరికుప్పల తోనేశ్వర్(ప్రజా జాగృతి),మంచికంటి రమేష్ గుప్తా(సత్యా న్యూస్),కనకమోని శ్రీనివాస్(cvr), చిలువేరు సంజీవ(దిశ) తదితరులు పాల్గొన్నారు.
Spread the love