– ఇ.ఆర్.ఒ, అదనపు కలెక్టర్ రాంబాబు.
నవతెలంగాణ- అశ్వారావుపేట: శాసనసభ ఎన్నికల పోటీలకు నామినేషన్ స్వీకరణ నోటిఫికేషన్ ను ఈ నియోజక వర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు శుక్రవారం ఉదయం 11 విడుదల చేసారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని అన్నారు. శుక్రవారం (03 – 11 – 23) తేదీ నుండి వచ్చే శుక్రవారం( 10 – 11 – 23) వరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ లు స్వీకరిస్తామని తెలిపారు. అభ్యర్థులు మీ మీ నామినేషన్ లు అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారికి లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అశ్వారావుపేట తాహశీల్ధార్ నామినేషన్ ప్రతులు అంద చేయవచ్చు నని అన్నారు. నామినేషన్ దరఖాస్తులు కూడా ఈ కార్యాలయం లో లభ్యం అవుతాయని తెలిపారు.
13.11.23 తేదీ సోమవారం ఉదయం 11 గంటల నుండి దరఖాస్తు పరిశీలన (స్క్రూట్నీ) జరుగుతుంది అన్నారు. 15.11.23 తేదీ బుధవారం సాయంత్రం 3 లోపు నామినేషన్ (అభ్యర్థిత్వం) ఉపసంహరణ చేసుకోవచ్చు అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించ బడటం తో పోలింగ్ సమయం కుదించడం అయిందని అన్నారు. (ఎన్నికల తేదీ)30.11.23 తేదీ గురువారం ఉదయం 7 గంటలు నుండి సాయంత్రం 04 గంటల వరకు పోలింగ్ జరుగును అన్నారు.
నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తీ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రెవిన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం11 గంటల నుండి మ.3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు వుండగా నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థి సహా ఐదుగురికి మాత్రమే అనుమతిస్తారు. పోలింగ్ కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేసి కేంద్ర బలగాలు సహా పోలీసులు పాహరాఋ కాస్తున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి మూడు వాహనాలకు మాత్రమే లోనికి అనుమతి ఇస్తారు.