ముళ్ళ పొదల తొలగింపు ..

– గ్రామ ప్రత్యేక అధికారి మండల పంచాయతీ అధికారి పార్థసారథి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించి ముళ్లపదలను తొలగించే కార్యక్రమా న్ని నిర్వహించిన నెల్లికురు మండల గ్రామ ప్రత్యేక అధికారి మండల పంచాయతీ అధికారి బండారు పార్థసారథి తెలిపాడు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శుక్రవారం గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో పారిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో బాలరాజు హాజరై వారికి తగు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలో పరిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించాలని నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని సీజన్ నుండి బయట పడాలంటే గ్రామంలో పరిశుభ్రత అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కారోబార్ రమేష్ గ్రామపంచాయతీ సిబ్బంది శ్రీనివాస్ విజయ వెంకటమ్మ ముత్తమ్మ యాకయ్య ఎంపీడీవో ఆఫీసు సిబ్బంది కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love