– కత్వధార స్టోరేజ్ అయిన నీటితో రైతులకు మేలు
– ఏడాది నుంచి మరమ్మతులకు నోచుకోని వైనం
– వృథాగా పారిపోతున్న వర్షపు నీరు
– మరమ్మతులు పనులు వెంటనే చేపట్టాటి : అన్నదాతలు
నవతెలంగాణ-తాండూర్ రూరల్
తాండూరు మండలం గోనూరు శివారులోని జుంటి వాగు కత్వ మరమ్మతులకు గురికావడంతో ఆయకట్టులో నీరు నిల్వ ఉండటం లేదు. గతేడాది నుంచి ఇరిగేషన్ అధికారులకు విన్నవించిన వారు మరమ్మతులు చేయించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కత్వ మరమ్మతులు చేయిస్తే తాండూరు మండలం, గోనూరు, వీర్ శెట్టిపల్లి, నారాయణపూర్ గ్రామాలలోని 200 నుంచి 300 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంతేకాకుండా ఆయకట్టు మీరు నిల్వ ఉండడంతో భూగర్భ జలాలు పెరిగి, బోరు మోటార్లలో కూడా, నీళ్లు సమృద్ధిగా వచ్చేవి. ప్రస్తుతం కత్వ మరమ్మతులకు గురి కావడంతో నీరు నిల్వ ఉండక, సాగు నీరు తోపాటు, బోరు మోటార్లలో కూడా, నీటి కొరత ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. తాండూర్ మండలంలోనే కాకుండా, యాలాల మండలంలోని ఎన్కేపల్లితో పాటు కాసింపూర్ రైతు లకు కూడా నీటి కొరత ఏర్పడుతుంది. గతంలో నీటి నిలువ ఉండటంతో భూగర్భ జలాలు పెరుగుతూ ఉండేవి. ప్రస్తుతం మరమ్మతులకు నోచకోలేదు. ఏడాది నుంచి ఆయాకట్ట చుట్టూ ఉన్న, సుమారు ఏడు గ్రామాల రైతులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఈ ఆయకట్టు ఉండడం వల్ల బోరులో నీళ్లు సమృద్ధిగా నీరు వచ్చి, పంటలు బాగా పండేవి. ఈ నీటితో సుమారు 300 ఎకరాలకు పైగా సాగు చేసుకునే పంటలకు ఉపయోగంగా ఉండేది. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి, మరమ్మతులు చేపట్టి, రైతులను ఆదుకోవాలని గోనూరు, వీరుశెట్టి పల్లి, నారాయణపూర్ తదితర గ్రామాల రైతులు కోరుతున్నారు.
మరమ్మతుల కోసం కృషి చేస్తాం
మూడేండ్ల క్రితమే ఆయాకట్ట మరమ్మతుల కోసం నిధులు మంజూర య్యాయి. ఆయకట్టు కింద తూములు కూడా నిర్మించాం. గతంలో ఉన్న పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నందున, మళ్లీ మరమ్మతులు చేసేందుకు ప్రణాళిక ఇవ్వడం కుదరడం లేదు. గతంలో మరమ్మతులు చేసిన, కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయాలనీ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశాం. మరోమారు నోటీసు జారీ చేసి, ప్రోగ్రెస్‌లో ఉన్న వర్క్‌ను తొలగించి, నూతనంగా ప్రణాళిక సిద్ధం చేసి, పై అధికారులకు పంపించి, మంజూరు కాగానే పనులు పూర్తిచేసే బాధ్యత తీసుకుంటాం.
– సాయికుమార్, ఇరిగేషన్ ఏఈ