లక్నవరం చెరువు, తూముల మరమ్మత్తులు పూర్తి

నవతెలంగాణ – గోవిందరావుపేట

మండలంలోని రైతాంగానికి కల్పతరువు లాంటి లక్నవరం చెరువు తూముల మరమ్మత్తుల పనులు దాదాపు పూర్తికావచ్చాయని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులైన ఏఈలు అర్షద్ క్రాంతి ఉపేందర్ రెడ్డి మరియు డి ఈ ఈ శ్రీనివాస్ లు నిరంతరం నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నట్లు , 90 శాతానికి పైగా పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం చెరువు తూముల మరమ్మత్తుల కొరకై సుమారు రూ.22 లక్షల రూపాయల ను కేటాయించి టెండర్ పద్ధతి ద్వారా మరమ్మతు నిర్మాణ పనులు  ప్రారంభించడం జరిగిందన్నారు. వర్షాకాలం సమీపించినందున పనులు ప్రారంభంలో ఆలస్యం కావడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ కూడా సకాలంలో పనులు పూర్తి చేస్తామా లేదా అన్న సందేహం కలిగిందని భగవంతుని కృప వల్ల సకాలంలో పూర్తి చేయగలిగామని గుత్తేదారు పెండెం శ్రీకాంత్ అన్నారు. క్వాలిటీతో కూడిన పనులు నిర్వహించాలని తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇంజనీర్ ల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తేదారు శ్రీకాంత్ మాట్లాడుతూ తన కుటుంబం పూర్తిగా వ్యవసాయ రైతు కుటుంబం అని తన తాత తండ్రి అందరూ ఈ చెరువు కింద వ్యవసాయం చేసి జీవనం సాగించిన వారేనని దీనికి సంబంధించిన సాధకబాధకాలు పూర్తిగా తెలుసునని నాణ్యత పనుల విషయంలో  ఎక్కడ రాజీ పడకుండా అధికారుల పర్యవేక్షణలో మరమ్మతు పనులను దాదాపుగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. చిన్న చిన్న పనులు ఉన్నాయని ఒకటి రెండు రోజుల్లో పూర్తి అవుతాయని అన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Spread the love