నీట్‌ అవకతవకలపై చర్చించాలని గవర్నర్‌కు వినతి

– రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకష్ణన్‌ను కోరిన విద్యార్థి యువజన సంఘ నేతలు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ, అవకతవకలపై చర్చించడా నికి గవర్నర్‌ సమయం కేటాయించాలని విద్యార్థి యువజన సంఘ నేతలు కోరారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యు) రాష్ట్ర కార్యాలయం విద్యానగర్‌ మార్క్స్‌ భవన్‌ విద్యానగర్‌ లో పీడీఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకష్ణ అధ్యక్షతన విద్యార్థి, యువజన సంఘా ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్‌ఎస ్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి మూర్తి, పీడీఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకష్ణ, పీడీఎస్‌యు రాష్ట్ర అధ్య క్షులు మహేష్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి. జావిద్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, కల్లూరు ధర్మేంద్ర, పీ వైఎల్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్‌.ప్రదీప్‌ హాజరై మాట్లాడు తూ.. జాతీయస్థాయిలో మెడికల్‌ విద్య కోసం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న (అండర్‌ గ్రాడ్యుయేషన్‌) నీట్‌ పరీక్ష 2024 మే 5న నిర్వహించారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా తెలంగాణ రాష్ట్రం నుండి 7 లక్షల మంది విద్యార్థులు రాశారు. వీటి ఫలితాలు జూన్‌ 4 న విడుదల అవుతాయని ఎన్టీఏ (నేష నల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) ప్రకటించింది కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్‌ 4 న వెలువడగా అదే రోజు హుట హూటిన నీట్‌ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు బహిరంగ క్షమపణ చెప్పాలని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 24 లక్షల మందికి న్యాయం జరగాలంటే పూర్తిస్థాయిలో పేపర్‌ రద్దుచేసి, మళ్లీ నిర్వహించాలి. ఎన్టీఏ ను రద్దు చేయాలని పేపర్‌ లీకేజికి కారణమైన వాళ్లపై చర్యలు తీసుకోవాలని నీట్‌ పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్ప చెప్పా లని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ శ్రీకర్‌, ఎస్‌ఎఫ్‌ఐ అశోక్‌ రెడ్డి, రజినీకాంత్‌ పీడీఎస్‌యు శ్రీహరి, సాయి, కష్ణ, ఏఐవైఎఫ్‌, నెర్లకంటి శ్రీకాంత్‌ శ్రీమాన్‌, షేక్‌ మహమూద్‌, మాజీద్‌ అలీ ఖాన్‌, కళ్యాణ్‌, అనీల్‌ కుమార్‌, బాలు,డి.వై. ఎఫ్‌.ఐ హష్మీ బాబు, పి.వై.ఎల్‌ బి.ఎస్‌ కష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love