Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్త బోర్లకు కనెక్షన్స్ ఇవ్వాలని కార్యదర్శికి వినతి

కొత్త బోర్లకు కనెక్షన్స్ ఇవ్వాలని కార్యదర్శికి వినతి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో నీటి ఎద్దడి నివారణ కోసం కొత్తగా వేసిన బోర్లకు వెంటనే కనెక్షన్లు ఇచ్చి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు తెలిపారు. ఈ నేపథ్యంలో పంచాయతీ పరిధిలోని ఆరుగురు వార్డు సభ్యులు కలిసి పంచాయతీ సెక్రెటరీ సందీప్ కుమార్ కు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భగా వారు మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా కొత్త బోర్లు వేసిన వాటికి కనెక్షన్లు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1 వార్డ్ సభ్యులు తుకారం, 5 వార్డ్ సభ్యులు శ్రీకాంత్, 6 వార్డ్ సభ్యులు నరేష్, 8వార్డ్ సభ్యు రాలు కుటుంబ సభ్యులు నాగేష్, 9వార్డ్ సభ్యులు సిహెచ్ . హన్మాండ్లు, 10 వార్డ్ సభ్యురాలు కుటుంబ సభ్యులు గంగాధర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -