నవతెలంగాణ – నసురుల్లాబాద్
దోమల బెడద తో ప్రజలు మంచం పట్టరాని నవతెలంగాణ పత్రికలో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందిస్తూ నసురుల్లాబాద్ మండలంలోని సంగెం గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ, దోమల బెడద నిరవరణకై చర్యలు తీసుకున్నట్లు మండల పంచాయతీ అధికారి రాము తెలిపారు. శనివారం, ఆదివారం రెండు రోజుల నుంచి గ్రామాల్లో ఫాగింగ్ చెయ్యడం జరిగింది. మాజీ ఎంపిపి అధ్వర్యంలో దోమల బెడద తీవ్రంగా ఉండడంతో గ్రామాల్లో ఉన్న చెత్త చేదరంను తొలగించారు. మురికి కాలువలను మురికి లేకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామంలో తిరుగుతూ గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ , ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో దోమల నివారణా చర్యలు చేపట్టి, డ్రైడే పాటించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. సమిష్టి కృషితో జ్వరాలు ప్రబలకుండా చూడాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ కై ప్రజలు అవగాహన కల్పించారు.