నవతెలంగాణ వార్తకు స్పందన

– పెద్ద మజీద్ ను సందర్శించిన ఆర్ అండ్ బి అధికారులు,
– వేగవంతంగా పనులు చేపట్టుతాం: ఆర్.అండ్.బి ఈఈ ప్రభాకర్
 నవతెలంగాణ – సూర్యాపేట
నిలిచి పోయిన నిర్మాణాలు-పెద్ద మజిద్ నిర్మాణం నిలిపివేత అంటూ ఇటీవలే నవ తెలంగాణ దిన పత్రిక లో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. ఈ మేరకు ఆర్.అండ్.బి ఈఈ ప్రభాకర్ సిబ్బంది తో కలిసి శనివారం స్థానిక పెద్ద మజీద్ ను సందర్శించారు.ఈ సందర్భంగా నిలిచిపోయిన పనులను ఆయన పరిశీలించారు. యస్.డి.ఎఫ్ క్రింద పెద్ద మజీద్ నిర్మాణానికి 2022 సంవత్సరంలో 50 లక్షలు మంజూరు అయిన నిధులతో పనులను ముమ్మరంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఈఈ పేర్కొన్నారు. మజీద్ చుట్టూతా నిర్మాణం తో పాటు ఎంట్రన్స్ లో ముఖద్వారాలు, కిటికీలు, ఎలక్ట్రానిక్ వర్క్స్, పివోపి,టైల్స్, బాత్ రూమ్ తదితర నిర్మాణాలు చేపట్టవలసి ఉందని ఈ సందర్భంగా అధికారులు గుర్తించారు.ఈ మేరకు మజీద్ లో మిగిలిన పనుల నిర్మాణం కోసం మేజర్మెంట్ వేయాలని ఈఈ సిబ్బందితో పేర్కొన్నారు.గత ఆరు సంవత్సరాలు గా మజీద్ నిర్మాణం నత్తనడకన సాగుతుందని నమాజ్ సమయంలో తాము పలు ఇబ్బందులు పడుతున్నామని ఈ సందర్భంగా నమాజీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.చుట్టూ గోడల నిర్మాణం లేక పోవడంతో  కోతులు, కొండముచ్చులు, కుక్కలు, పిల్లులు మజీద్ లోపలికి వచ్చి నమాజి లను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తక్షణమే మజీద్ నిర్మాణం పూర్తి చేయాలని వారు కోరారు.స్పందించిన ఈఈ యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ కు సూచించారు.
Spread the love