దీక్ష విరమించిన మోతీలాల్ నాయక్..

నవతెలంగాణ-హైదరాబాద్ : నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్ష విరమించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచడంతోపాటు గ్రూప్1లో 1:100 రేషియోలో భర్తీ చేయాలన్నది మోతీలాల్ డిమాండ్. తొమ్మిది రోజులుగా గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఆరోగ్యం క్షీణించడం, కిడ్నీలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఉండడంతో దీక్ష విరమించినట్టు మోతీలాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా నిరుద్యోగుల సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని, రేపటి నుంచి పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

Spread the love