– డిపో ముందు రిటైర్మెంట్ ఆర్టీసీ కార్మికులు ధర్నా
నవతెలంగాణ – అచ్చంపేట
ఆర్టీసీ సంస్థలో సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ వయసురీత్యా పదవీ విరమణ పొందిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిపో కార్యాలయం ముందు టి ఎస్ ఆర్ టి సి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డిపో మేనేజర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి.. సిఐటియు నాయకులు శంకర్ నాయక్ మాట్లాడారు. ఆర్టీసీ సంస్థలు పని చేసినంత కాలము చాలిచాలని జీతంతో సమస్త అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినామని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ద్వారా రిటైర్మెంట్ ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన టెర్మినల్ లీవ్, ఎన్క్యాస్మెంట్ను రిటైర్మెంట్ అయినా నెలలోపు చెల్లించాలి ఇప్పటివరకు చెల్లించలేదు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ అయిన నెలలోకే గ్రాడ్యుయేట్ చెల్లించాలి ఇప్పటివరకు చెల్లించలేదు చెల్లించాలని అట్లాగే 2017 పే స్కేల్ అమలు చేసి ఏరియాస్ ను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. రిటైర్ అయిన కార్మికులకు మెడికల్ ఫెసిలిటీ స్కీమ్ (ఆర్ ఇ ఎం ఎస్) సౌకర్యం 10 లక్షలకు పెంచాలి ఉమ్మడిగా 20 లక్షలు వర్తింప చేయాలి అని కోరారు. 2017 అరియర్స్ తో డి.ఏ, అరియర్స్ ముడి పెడుతూ తీసుకొచ్చిన సర్కులర్ నెంబర్11/24 ఉపసహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వము కనీసం పెన్షన్ 9000 వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈపీఎస్ కు కరువు భత్యం లింకు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు సమాచారం వచ్చిన తెలియక అవకాశం కోల్పోయిన ఆర్టీసీ కార్మికులకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. చట్ట విరుద్ధంగా అమలు చేస్తున్న హైయర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయ్యర్ పెన్షన్ చెల్లింపులో జాప్యం విడనాడి రివేంజ్డ్ పి పి ఓ లు వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వము పై డిమాండ్లు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఆర్టీసీ రిటైర్మెంట్ అయిన కార్మిక ఉద్యోగుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్మెంట్ కార్మికులు ఎం ఆర్ రెడ్డి, పి వీ చారి, ఎండి హబీబ్ ,ఆర్ శంకర్, జంగమ్మ, విజయలక్ష్మి, శ్రీశైలం బి శేఖర్, కుదూస్ తదితరులు పాల్గొన్నారు.