– బీఆర్‌ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సంభందించి సీఎం రేవంతరెడ్డి వద్ద ప్రత్యేక కార్యాచరణ ఏమీ లేదని బీఆర్‌ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గతంలో అప్పటి సీఎం కేసీఆర్ హయాంలో పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించిన పోస్టులకు ఇప్పుటి సీఎం రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు ఇస్తూ, అదేదో తానే ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నియామకపత్రాల అందజేత పేరుతో వేదికలపై నుంచి రాజకీయ ప్రసంగాలు చేయడం ఆయన మానుకోవాలని హితవు పలికారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.