ఆర్.కె.పల్లి ఆలయాలు చారిత్రకమైనవి..

RK Palli temples are historical..– ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలి
– పురావస్తు శాఖ అధికారి బాబు.
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని రాజుల కొత్తపల్లి గ్రామానికి చెందిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, బాలాజీ స్వామి ఆలయాలు చారిత్రక ప్రాధాన్యమైనవని పురావస్తు శాఖ అధికారి బాబు అన్నారు. గ్రామ యువకులు పురావస్తు శాఖకు చేసిన అభ్యర్థన మేరకు ఆ శాఖాధికారి బాబు గురువారం ఆలయాలను సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంబంధిత దేవాలయాలు 11వ, శతాబ్దానికి చెందినవని స్పష్టం చేశారు.వీటి చరిత్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెలుగు లోకి తేవడానికి సహకారం అందిస్తానని తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ..ఆలయాల సంరక్షణకు సహకారం అందించాలని ప్రభుత్వాన్ని,పురావస్తు శాఖను కోరారు. కార్యక్రమంలో  జగన్నాథ్, చొక్కా చారి, హరీష్, అశోక్, యాకయ్య పాల్గొన్నారు.
Spread the love